ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి యుదాహరణములచే గ్రంథంబుల నింపవచ్చును. అయిన నీరెండును నాకాలపు స్త్రీలకు గల ధైర్యస్థైర్యంబుల నిరూపింప లిఖింపబడియెను. వారిగుణములచే నలంకృత యగు ఆబ్రహాము తల్లి నిర్భయమానస యై యెల్ల గష్టంబులనెల్ల తొందరల నోర్చెను.

ఏడుదివసములు త్రోవ నడచిరని చెప్పితిమిగదా. అట్లు నడచి తమనిర్ణీతస్థానమునకు రెండుమైళ్లదూరమున నీలను పొరుగువారి గుడిసె చేరిరి. వారును లింకనుల మిక్కిలి యాదరించి మఱునాడు గృహనిర్మాణంబున దోడ్పడ బూనిరి.

ఈయనుభవవిషయములెల్ల బెంచివ్రాయుట కొకకారణ మున్నది. ఇ వెల్లయు నాబ్రహామునందు ధైర్యస్థైర్యసాహసాదిగుణంబుల వృద్ధికి హేతుభూతంబు లాయె ననుటకు సందియంబులేదు.

_______

మూడవ ప్రకరణము

నూతన నివాసస్థల నిర్మాణము.

ఆకాలమున 'దేశసంపాదన మార్గదర్శకు' లగు వారలకు ముఖ్యసాధనము గొడ్డలి. దాని నుపయోగించుటయందు బ్రావీణ్యము సంపాదింప బ్రారంభించుట యాబ్రహామునకు