ఈ పుట ఆమోదించబడ్డది

సూచించిన దారిని యుద్దేశితస్థానముచేరి లంగరు వైచెను. అటనుండి పదునెనిమిది మైళ్లు లోపలికి సారాయితో గూడ తన్ను గొంపోయి విడుచుటకు పోసీ యను మార్గదర్శకుని నియమించుకొనియెను. అతని కుంకువగ దనతెప్ప నియ్యనంగీకరించెను. పోసీ యొక కాడియెద్దులు గలవాడు. తెప్పనొకదాని నెచ్చటనైన గొనవేచియుండెను. థామసునకు దెప్పతో దరువాత బనిలేకుండెను. కావున వీరిద్దఱికిని నీబేరము పొసగెను.

పయనమై కదలుటకుమున్ను దేశస్థితి చక్కగ గుర్తెఱిగినవాడు గాన పోసీ "ఈప్రాంతముల మంచి బాటలు లేవు. మన మడవి ఛేదించుకొని వెడలవలసియుండు" నని నొడివెను. థామసద్దానికి గుంది "నివసించు జనులైన నిందున్నారా" యనియెను. "అచ్చటచ్చట నలువురు నలువు రున్నారు. మిము జూచినవా రత్యానంద మొందెదరుగాక. వెడలుదము రండ"ని పోసీ దన కాడిగట్టి దానిపై తిత్తుల నెక్కించి తన యజమానుని దోడ్కొని దారిబట్టెను. కడుదవ్వరుగకమున్నె దట్టం బడుగహనప్రదేశ మాసన్న మాయెను. గొడ్డలితో జెట్లుచేమల నఱకి త్రోవచేసికొని ప్రయాణము జరప నారంభించిరి. ఎంతదూర మిట్లు ప్రయాస పడవలె నని విచారింప నదియెల్లయు నడవియే యనియు బాట లేర్పఱచుకొనుట కష్టతర మనియు విశద మాయెను. అయినను దుస్సాద్యం బని