ఈ పుట ఆమోదించబడ్డది

మున్నె యతడు బైబిలునం దెక్కుడుభాగము నెఱింగికొనెను. విద్యాభ్యసనము చేసినతరువాత నాయన కొదవిన ప్రథమ గ్రంథము నదియె. గొప్పవా డై లోక వ్యవహారముల బేరొందునప్పటికి గ్రైస్తవుడు గా కున్నను అతడు బైబిలును మాత్రము మరవలేదు. తఱుచుగ నా గ్రంథస్థితి విషయముల నట్టె ప్రయోగించుచుండె ననుట కనేక దృష్టాంతము లున్న యవి. ఆ యుత్కృష్ట గ్రంథపఠనం బాబ్రహామునందు నమ్రత, సత్యము మొదలగుసద్గుణముల యంకురములను నాటి యతని పురోభివృద్ధికి దోడ్పడెననుట నిర్వివాదాంశము.

కెంటకీ సీమ 'బానిససీమ' యగుట దత్ప్రాంతమున నేదేని యొక 'ముక్తసీమ' గలిగిన నటకు వెడలుదముగా కని లింకనులు వేచియుండిరి. వా రిట్టిప్రయత్నమున నుండుటకు గారణము మఱి యొకటిగలదు. కెంటకీ సీమయందు క్షేత్రస్వామ్య మస్థిర మగుచుండెను. అనేక సంవత్సరము లెండ యనక, గాలి యనక కష్టించి భూమి వృద్ధి జేసికొని యనుభవింతము గదా యని యుండ నోటికివచ్చినకడి జారిపడె నను విధమున భూ స్వాతంత్ర్యం బగోచరం బగుచుంట తటస్థించుచు వచ్చెను. అనేకులు దమ పూర్వీకులు గడించిన స్థితినంతయు గోలుపోయి రిక్తహస్తు లయిరి. ఇట్లు నష్టప్రయాణము వాటిల్లుచుంబం జూచి ప్రతి భూ స్వామియు దన హ