ఈ పుట ఆమోదించబడ్డది

ఆబ్రహాము లింకను ప్రవేశించిన పల్లెకూటము రైని యను నుపాధ్యాయునిచే నుంచబడి యుండెను. అత డచటికి గ్రొత్తగా వచ్చినవాడు. ఉపదేశమునకు వలయు సామగ్రి యెంతమాత్రమును గలవాడు గాడు. తన శిష్యులకు వాచకముమాత్రము నేర్ప గలవాడు. వ్రాత గఱపుట కాతనికి జాతుర్యము చాలదు. మిక్కిలి బీదవా డగుట నాతడు దనకొద్ది రాబడి కేదో మఱికొంత జేర్చి జీవనోపాయ మేర్పఱచు కొన నీపనికి బూనెను. అతనికంటె సమర్థు డిం కొకరుడు దొరకనందున దలిదండ్రు లాతని శిక్షకై తమ బిడ్డల ననుప నియ్యకొనిరి. ఇట్టి గురువుకడ నాబ్రహాము లింకను తలిదంద్రులతనికి విద్య యెంతెంత చేకూరిన నంతంత లాభకారి యగునని నమ్మి యతనిని అతనిసోదరి సారాను విద్యాభ్యసనమునకు బంపిరి. అచ్చటి పుస్తక భాండాగారమున శిధిల మైన డిల్ వర్తు వర్ణక్రమ పుస్తక మొండుమాత్ర మొప్పుచుండును. అద్దానినే బహు జాగరూకతతో వారు సంపూర్ణ ఫలాపేక్షచే నుపయోగించిరి. బుద్ధిమంతు లెట్టి స్వల్పసాహాయ్యంబు నైన స్వవృద్ధి కుపయోగించుకొందురుగాదే!

ఇట్లుపాధ్యాయులకడ నాబ్రహాము వాచకము నేర్చుకొనెను. అయిన నా విద్యాలయము చాలకాలము నిలచినది కాదు. అయిదారు వారములలోపల దాని యాయు వుడి