ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి కష్టతరానుభవంబుల విషయము లాబ్రహామునం దేలాటి యూహ లొడమజేసినదియు జెప్ప నలవిగాదు. అయిన దన పూర్వీకుల స్థితికంటె దనస్థితి పెక్కు మడుంగు లనుభవ నీయ మనుట మాత్ర మాతనికి దప్పక విశద మై యుండును.

నాబుచరియ గృహమునందే ఆబ్రహాము లింకను చేపలు పట్టుట మొదలగు నాటల నేర్చెను. మిక్కిలి చిన్నవాడుగ నుండునపుడే యత డసామాన్య శక్తి జూపుచుండెను. ఆరు సంవత్సరములనాడే యత డేదుబందుల వేటాడుచుండెను. మఱియు జెట్టు కొమ్మల బట్టుకొని జలాశయంబులపై నూగుచుండు టాతని కత్యానందదాయి. అత డొకనా డీ కార్యమున నుండ నకస్మాత్తుగ బట్టువదలి గభీలున తటాకంబున బడియెను. అతని తోడిబాలు డగు బిల్లి మనస్థైర్యంబు సూపి, జాగ్రత్తపడి, సత్వరమున నతని సేవింపకున్న థామసు లింకను దన పుత్రరత్నంబును, యునైటెడ్ స్టేట్సు దన దేశాధ్యక్ష శిరోమణిని నాడు గోలుపోయి యుండును.

అనేకవిధంబుల నాబ్రహాము తన బుద్ధిచాతుర్యంబులను, శక్తి సాహసంబులను బిల్లతనమునందే చూపి తనసాటి బాలుర కంటె మిక్కిలి సమర్థు డగుట వెల్లడి చేసెను. అతని తల్లి దండ్రు లీ విషయమును గ్రహించి సంతసింపక పోలేదు. రా