ఈ పుట ఆమోదించబడ్డది

దీనివలన నుత్తరభాగమున జనులెల్ల నొక్కరీతిగ బరిగణింపబడచు రాజకీయవిషయముల బ్రతినిధులద్వారా స్వానుకూల విధులనే యంగీకరించుచుండ దక్షిణమున దర్జాభేదము లెక్కువయై కాయకష్టము హేయముగ నెంచబడి బానిసవ్యాపారము గడుపెంపు నొందుటకు మార్గము లేర్పడెను. అయిన నాంగ్లేయులకు స్వాతంత్ర్య మనినను బ్రాణ మనినను నొక్కటియ. కాబట్టి దక్షిణ భాగమునందలి వారుగూడ దమ దమ ప్రజా ప్రతినిధిసంఘముల వృద్ధికై పాటుపడుచు బరిపాలనా భాగము విశేషము దమచేత నుంచుకొనుచు వచ్చిరి.


ఇట్లగుట నిప్పుడు యునైటెడ్ స్టేట్సను ప్రదేశమున మొదట మొదట నింగ్లాండునకు లోబడి కొన్ని పరిపాలనా స్వాతంత్ర్యముగల పట్టణములును, సీమలును, మఱికొన్ని యర్ధస్వాతంత్ర్యముగల సీమలు నుండెను.

ఇవన్నియు గాలానుగుణముగ బోయినపోక లనేకములు గలవు. ఇట విస్తరమనవసరము. ప్రథమముననుండి ఈపట్టణములవారును సీమలవారును నేకీభావమున మెలగుచుందురు. తమలో నెవ్వరికేయాపద వచ్చినను అందఱు జేరి దాని నివారింప జూచుచుందురు. 1770 వ సంవత్సర ప్రాంతముల నాంగ్లేయ ప్రభుత్వమువారు దమదేశీయుల లాభమునకై యమెరికా యందలిసీమలపై గొంతపన్ను విధింపజొచ్చిరి. తమలో