ఈ పుట ఆమోదించబడ్డది

లింకను మరణవార్త దేశదేశములకు బర్వెను. మన చక్రవర్తినిగా నుండిన విక్టోరియాయును, ఫ్రాంసు చక్రవర్తిగ నుండి స్వాతంత్ర్యమునకు బాటుపడిన నెపోలియను, నతని సతియు, ఫ్రాంసు, రష్యా, ఇటలీ, ప్రషియా మొదలగు దేశముల రాజ్యాంగమువారును దమ దు:ఖమును వెల్లడిసేయుచు లింకనుసతి నోదార్చుచు పత్రికలు వ్రాసిరి. స్వాతంత్ర్యము గోరువారందఱును లింకను మరణము విని యశ్రులు రాల్చిరి.

లింకను కళేబరమును రెండవరోజు వాషింగ్టనునందు సితగృహమునకు దీసికొనిపోయిరి. అచ్చటినుండి యుచితవిధమున స్ప్రింగుఫీల్డునకు నతని స్వగ్రామమునకుం గొంపోవ నేర్పఱచిరి. ద్రోవయం దొక్కొక్కపట్టణమునను కోట్లకొలది ప్రజలు లింకను శవమునకు మహా గౌరవము జూపి తమదు:ఖమును వెల్లడిచేసిరి. శోకార్ద్రహృదయులు సల్పు సపర్యల గొనుచు లింకను దేహమాత్రుడై యిలువచ్చి చేరెను. అచ్చట నతని బంధుమిత్రు లెంత పొగిలిరో చదువరుల యూహింతురుగాక. మరణానంతరకృత్యముల నొనర్చి నతాన నులై మౌనమున దు:ఖధారల వెల్లడించుచు వేనవేలు జను లాతని కళేబరమును సమాధి జేర్చిరి. * అచ్చట నాచార్యులు ______________________________________________________________

  • అచ్చట నొక పెద్దభవనముగట్టి రాజ్యాంగమువారు లింకనును గౌరవించియున్నారు.