ఈ పుట ఆమోదించబడ్డది

నాట్యరంగమున కెదురుగ నొక యుత్తమాసనమున నాసీనుడయ్యెను. ఆశాలయందలి జనులెల్లరు దమతమస్థానముల గూర్చుండిరి. సద్దడగినాటకము ప్రారంభమాయెను.

పదిగంట లగునప్పటి కొకగుండు రివ్వుమని పాఱుట విననాయెను. కొంద ఱది నాటకమున నొకభాగ మేమోయని తలంచుచుండిరి. అయిన లింకనుసతికేక లిడుటయు హతకుడు లింకను నాసనము క్రిందినుండి నిర్గమించుటయు నొక ఘోరకార్య మనివార్యముగ జరిగెననుట యెల్లరకుం దెల్లము సేసెను. ఆ హతకుడు రంగస్థలమున కెగసి

"రాజబ్రువు లిట్లె మడయుదురు గాత" మని గర్జించుచు దళతళమెఱయు నొక ఖడ్గముం ద్రిప్పి,

"నేటికి దక్షిణసీమల పగదీరె" ననుచు దప్పించుకొని పోయెను.

చూపరులెల్ల రొక్క నిమిషమాత్రము దిగ్భ్రమజెంది చూచిరి. వెంటనె వారిలో నొకడు 'జాన్ విల్కుసుబూ త'ని బిగ్గరగ నఱచె. అనేకులు 'వానిం గాల్వుడి కాల్వు డని' వాని వెన్నంటిరి. స్త్రీలు గొల్లుమని యేడ్చి మూర్ఛవోయిరి. పురుషు లొడలుదెలియనివారింబోలె నదరించుచు బెదరించుచుచుండిరి. అందఱును వ్యాకులచిత్తు లయిరి. వారి యవస్థ వర్ణింప నలవిగాదు. మహా వైభవమున సంతోష