ఈ పుట ఆమోదించబడ్డది

యున్నది. దానిప్రకారమ యొనర్చుచున్నాన"ని దయామయత్వంబున నీ మహనీయుడు దన పదవి కార్యముల నుపేక్షింపరాని వాని వదలి రోగపీడితు డై దు:ఖమున మున్గిన హీనమానవునికి సాయ మొనర్చి యోదార్ప సమకట్టి యుండుట వెల్లడి పఱచెను.

"తిరుగుబాటు" పరిపాలకులు నీగ్రోయుద్ధభటులు చేజిక్కినచో దయ యనుమాటయే తల పెట్టక వారిని నాసుర ప్రవర్తనంబుచే నలయించి పొలియించుచుండిరి. ఆ ఘోర వృత్తాంతము దన చెవి బడినతోడనె లింకను నీగ్రో సైనికుల సంరక్షణార్థమై యీక్రింది యుత్తరువు ప్రకటించెను.

"దేశమందలి ప్రజలకెల్లరకును జాతిమతాది భేదము లెంచక సంరక్షణ యొసంగుట ప్రతి ప్రభుత్వమువారికిని ధర్మమయి యున్నది. అందునను సైనికులుగ గ్రహింపబడినవారికి శరణ మొసంగుట ముఖ్యతమము. రాష్ట్రముల చట్టము ననుసరించియు సభ్యజాతుల యుద్ధ నిర్వహణ కార్యముల యనాది మర్యాదలం బట్టియు బట్టువడిన పరజాతి బందాల నాదరించుటయందు దెల్లవారు నల్లవారను తారతమ్య మెంచగూడ దనుట విదితము. చిక్కిన యేమనుజుని నైనను నీగ్రో యనికాని యకారణముగ గాని బానిసగ నమ్ముట యమానుషంబును నిప్పటి నాగరిక జనుల కొక పెద్ద యప