ఈ పుట ఆమోదించబడ్డది

పౌరుల బలె బరిగణింప బడుదురుగాక. యునైటెడ్ రాష్ట్రపు నధికారు లీ విషయము గుర్తెఱింగి బానిసలు విడుదలనొందుటకై చేయు ప్రయత్నములం దెల్ల దోడ్పదురుగాక. వారి కేలాటి యభ్యంతరములును జేయకుందురు గాక" అను సారాంశములు గలప్రకటన యారాష్ట్రమం దంతయు బ్రజ్వరిల్లెను. ఈ విమోచన ప్రకటనపత్రంబె యమెరికనుల స్వాతంత్ర్య గౌరమున కనూనతార్కాణంబై నేటికిని ఇకముందెప్పటికిని వారి రాజ్యాంగమునకు నుత్తమాలంకరణముగ నొప్పెడిని.

ఈ విమోచనపత్రము వెలువడినతోడనె దక్షిణసీమల వారు పలువిధముల లింకనుకు జంకుపుట్టింపజూచిరి. అయిన ప్రయత్నములెల్ల వృథ యయ్యెను. 1863 వ సంవత్సరము ప్రారంభ మగుటయు విమోచనపత్రము సంపూర్ణముగ జెల్లింపబడియెను.

కొంద ఱుత్తరసీమలవారు దాస్యనిరాసకులుగూడ నీపత్రమునకు గినిసిరి. లింక నొక్క పెట్టున నందఱకు స్వేచ్ఛ గలుగ జేయలే దనియు ననేక నిబంధనల జేర్చెననియు వా రసంతృప్తులైరి. సంయోగము జేరగోరిన దాస్యము వదలుట ముఖ్యమైయుండెను. కావుననే తిరుగుబాటుసీమయేని నిర్ణీతదినమునకు మున్ను సంయోగము జేరెనా ముక్తసీమ దనంతట దాన