ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగువారిని బతిమాలి యాసైనికుని మిత్రులు విఫలము నొందిరి. తరువాత హారిసు దేశాధ్యక్షుని దగ్గరకు వెళ్ల నిశ్చయించుకొనెను. బృహస్పతివారము ప్రాత:కాలము సైనికుని నురిదీయ నిశ్చయించిరి. బుధవారమురాత్రి పండ్రెండుగంటలకు హారిసు లింకను గృహము సేరెను. అప్పుడు లింకను నిదురబోవుచుండెను. హారిసు వేచియున్నాడను వార్త చేరి చేరకమున్నె యతడుమేల్కొని లేచి రాసెలవిచ్చెను. హారిసాయనప్రక్కన గూరుచుండి యాసైనికునికి నిశ్చయముగా మనోవైకల్యమే యనియు నతనిశిక్ష యతడు వైద్యులచే బరీక్షింప బడువఱకు నాపబడవలెననియు వేడెను. వెంటనే లింక నాసైనికునికి విధించిన దండన యాపివేయ బడవలసినదని యొక తంత్రీవార్త బంప నుత్తరువుచేసెను. ప్రొద్దున లేచి మఱియొక తంత్రీవార్త బంపెను. సరియగుకాలమున నీవార్తలు చేరునో లేదోయను భయమున నాలుగువయిపుల నాలుగు వార్తలు నియమితకాలములో బంపెను.

మఱియొకసారి యొకపసిసైనికునకు బహరా కాచువేళ నిద్రవోయినందునకు గాల్పబడవలయు నను శిక్షవిధించిరి. అయిన నేదియో యొక కారణమున, నాతనిశిక్షుంచుట కొన్ని రోజులవఱకు నాపియుంచిరి. అప్పుడతడు తండ్రికి మిక్కిలిధైర్య మొసగుచు గంభీరోర్తుల, దానొక స్నేహితునితల్లికి జేసిన