ఈ పుట ఆమోదించబడ్డది

రెండువేల యిన్నూరింటికె. అందు నిప్పుడు సంశయించుచుండు నది నూటివిషయమె. నే నత డొక్క కాసైన నపహరించెనని నమ్ముట లేదు. కావున నిదివఱకు జేయబడిన తీర్పు లన్నియు నే నంగీకరించుటలేదు. అవియెల్ల నిందుమూలమున రద్దుపఱుపబడి ప్రతివాదులకు స్వేచ్ఛ యొసగబడినద"ని యుత్తరువు చేసెను.

ఈ విషయములన్నియు లింకను మెత్తనివా డైనను దగిన యెడ ధైర్యము సూపుచు వచ్చె ననుటను స్థిరపఱచుచున్నవి. అతడు దానే స్వయముగ యోచించి పనుల దీర్చుచుండె ననుటగూడ విశద మగుచున్నది.

లింకను దేశాధ్యక్షత వహించిన రెండవయే డతని కనేక దు:ఖములు సంభవించెను. యుద్ధపువార్త లొక్కటియెగాక యతని కుమారు డొక్కడు మృతినొందెను. రెండవవాడు పరలోకప్రాప్తి జెంద సిద్ధపడెను. లింకను వానిని గాచుచు బహుకాల మిలువెడలి బయటికి వచ్చిన దెఱుగడు. పుత్ర వియోగ మతనికి మిక్కిలి యసహ్య మాయెను. ఎంత పని పాటుల నున్నను 'నాయనా' యని ముద్దులొలుకు బల్కుల దగ్గర జేరు కుమారుడు మరణావస్థయందు బఱుండుట జూచిచూచి యెల్లపుడు దు:ఖించు చుండెను. కుమారునిపై నెనరున విలపించుచు గడు నమ్రహృదయు డై పలుమాఱు