ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాప్తి జెందువఱకు లింక నతని యాప్తస్నేహితుడుగ గణించు చుండెను. అతడును లింకనుకు శత్రువుల మాయోపాయముల దెలుపుచు మహోపకార మొనరించుచుండెను. అతను దివి కేగ నాతని మరణము దేశమునకంతకు నష్టమనుట లింకను వెల్లడిచేసెను.

లింకను దన ప్రథమోపన్యాసమున జేసిన వాగ్దానములకు భేదముగ నెన్నడును నడచినది లేదు. "మీరు ముందు యుద్ధమునకు జొరబడకున్న మీ కెట్టి పెనంగుటయు దటస్థింప ద"ని తన ప్రతికక్షవారికి జెప్పినవాక్కు నట్లె పాలించెను. దక్షిణరాష్ట్రముల సంఘమువారు 1861 వ సంవత్సరము ఏప్రిల్ నెల 12 వ తేదిన దిరుగబడి సంటరుకోటపై ఫిరంగి పేల్చి ముందు యుద్ధమును బ్రారంభించినవా రైరి. నాటి మధ్యాహ్నము "తిరుగుబాటు" సేనాని యాకోట సేనానిని లోబడు మని యనియెను. అందుమీద నతడు "రాజ్యాంగముపరమున నీకోట గాపాడుట నాకు ధర్మమై, యున్నద"ని ప్రత్యుత్తర మిచ్చెను.

"అట్లయిన నీపట్టణమువారు మా వైరులని యెంచెదమ"ని "తిరుగుబాటు" సేన యాపట్టణమును ముట్టడించెను.

లింక నాపట్టణమునందలి సేనకు భోజనపదార్థముల యుద్ధనావయందు బంపుటమాని సాధారణ నావయందు