ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహితు లతనిని లింకనుతో జేరమని వేడిరి. అతడును జక్కగ యోచించి యిట్టి యుత్పాతముల కాలమున వెనుదీసిన గార్యము సెడుననుట పరికించి లింకనుస్నేహముగోరి "సితగృహమున"కు జని యట లింకనును దర్శించి,

"తండ్రి! లింకను! ఈ రాష్ట్రమునకెల్ల దేశాధ్యక్షుడవగు నీవు నాకును దేశాధ్యక్షుడవె" యని చే యిచ్చెను. లింకను మనము కరగి మిక్కిలి సంతసమున నా కరంబు స్వీకరించి యతని దేశభక్తికి మెచ్చి వందనము లాచరించెను. ఈ విధమున మహా ప్రసిద్ధివడిన యిద్దఱు ప్రతి కక్షయందలి ప్రాముఖ్యులు దేశక్షేమమునకై యేకీభవించిరి. తరువాత లింకను డగ్లసునకు దన యుద్దేశ పత్రమును జదివి చెప్పెను. అం దతడు డెబ్బదియైదువేల సైనికుల జేర్ప నిశ్చయించి యుండెను. డగ్లసు దక్కినవిషయము నెల్ల లింకనుతో నంగీకరించి యీవిషయమునమాత్రము "రెండులక్షల సేనకూర్చిన బాగుండును. మీ శత్రువుల టక్కరితనంబుల నే నెఱిగినంత చక్కగ మీ రెఱుంగర"ని తెల్పి యాదేశ పటముపై రక్షింపబడవలసిన స్థలములనెల్ల జూపి రాజ్యాధికారు లిప్పటి తిరుగుబాటు నట్టె యణచివేయ గట్టి యేర్పాటుల జేసి తీరవలెనని చెప్పి ముగించెను.

మరునాడె లింకను డగ్లసు లొక్కటై రనుట దేశ మంతయు దెలిసిపోయెను. నాడు మొదలు డగ్లసు పరలోక