ఈ పుట ఆమోదించబడ్డది

1861 వ సంవత్సరము మార్చి నెల 4 వ తేది లింకను దేశాధ్యక్షత వహించు నుత్సవము జరుపబడియెను. ఆ యానందము చూచుటకు లక్షలకొలది జనులు వాషింగ్టను పట్టణమునకు వచ్చిచేరిరి. అల్లరుల కారంభించి దేశాధ్యక్షుని బొడిచివేయ బ్రయత్నములు గాగల వేమో యనుభయమున జనరల్ స్కా ట్టా పట్టణమును గాపాడుటకు దగిన దండు నాయత్తపఱచి యుండెను. లింకను దన ప్రథమోపన్యాసము నీ క్రిందిపదములతో రాజ్యవైరుల హృదయములకు నాట బల్కి ముగించెను.

"అతృప్తులగు నో దేశీయసోదరులారా! నావలన నెంత మాత్రమును నంతర్యుద్ధప్రాప్తి గా జాలదు. అట్టి ఘోరకృత్యము జరుగవలసివచ్చిన దానికి మీర యావశ్యకత గలుగ జేయువా రగుదురు. రాజ్యనిర్వాహకు లెప్పటికిని మీపై బడరు. మీరు ముందుపడి పోరాడకున్న మీ కెట్టి పెనంగుటయు దటస్థింపదు. మీ రీ రాజ్యాంగము నశింప జేయుద మని దేవుని యెదుట బ్రమాణము సేసియుండలేదు; అయిన నేనో నాయోపినంత రాజ్యాంగమును నిలిపి, సంరక్షించి, స్థాపింప సంపూర్ణ మనస్కుడ నై శపథ మంగీకరించి యున్నాను. ముగింపుసేయ నా మన సొప్పకున్నది. మనము శత్రువులము గాము. స్నేహితులమె యగుదుము. ద్వేషము మన మొకరిపై