ఈ పుట ఆమోదించబడ్డది

పదునేడవ ప్రకరణము

"పితగృహా" లంకరణము.

ఉత్తమోద్యోగమున లింకను సూపిన యౌదార్యాది గుణసంపత్తినిగుఱించి తెలుపుటయె మనకు గర్తవ్యము గాన నతడు దేశాధ్యక్షుడుగ నున్నంతకాలము ప్రబలుచుండిన "దిరుగుబాటు" నణచుటలో నతడు సేసిన యేర్పాటులను గనుపఱచిన శక్తియు వర్ణించుట యనవసరము. రెండుకోట్ల సంఖ్యగల "సంయోగపు" సేననుదీర్చుటయందును, దేశము నందలి యపాయకరంబులగు కక్షల నదపున నుంచుటయందును, దేశభక్తిపూర్ణుడగు బ్రతిమనుజుని గౌరవ విశ్వాసముల సంపాదించుటయందును, వేనవేలుయుద్ధరంగముల జయమందుటయందును, మహాశక్తియుత మగు నావిక సైన్యము నిర్మించుటయందును, యుద్ధమునకై మూడువేలకోట్ల డాలర్లు సేర్చుటయందును, రాజకీయ వ్యవహారముల జనులకు నమ్మిక గలుగ జేయుటయందును, నాలుగుకోట్ల బానిసలకు స్వచ్ఛంద వృత్తి నొసంగుటయందును, ము న్నెన్నటికంటె నెక్కుడుగ దేశమునకు నెమ్మది దెచ్చుటయందును లింకను వెల్లడించిన శక్తి సామర్థ్యంబు లత్యద్భుతములు. వీని నన్నిటింగూర్చి వ్రాయగడంగిన నొక్కొకదాని కొక్కొక సంపుటమైనం