ఈ పుట ఆమోదించబడ్డది

మార్గముల నోటువడి గుండుదెబ్బలచే జయింతముగాకని బద్ధసీమలు బద్ధవైరముం బూనిరి. యుద్ధము తప్పక తటస్థించుననుట తెల్లమాయెను.

పేర్కొనబడినదాదిగ లింకను సమ్ముఖమున కనేకులు వచ్చిపో గడంగిరి. గొప్పవా రనక, నీచు లనక, ముదుక డనక, బాలు డనక, బీద లనక, భాగ్యవంతు లనక యెల్లరును నా మహనీయుని జూడ వచ్చుచుండిరి. ఇట్లుండ నొకనా డిద్దఱుబాలు రతని కార్యస్థానము ముంగల నఱ్ఱాడుచుండిరి.

వారి సత్యాదరమున డాసి లింకను,

"నాయనలారా! సౌఖ్యంబున నున్న వారలే? మీ కే నేమి సేయవలయు? రండు. కూర్చొను" డనియెను.

వారిలో గుఱుచటివాడు "మేము గూర్చొనరాలే" దనెను.

"మీ కేమి గావలయునో యడుగు" డని లింకను వారి జంకు నుడువువిధమున బల్కెను.

దాని కా చిన్నవాడు "నేనును నాస్నేహితుడును మీపొడవునుగుఱించి వివాదపడితిమి. తాను మీపొడుగున్నాడని నుడువుచున్నా" డనెను.

అదివిని లింకను మొగమున చిఱునగ వంకురింప "ఆలాగా? ఆ చిన్నవాడు నిశ్చయముగా బొడవుగనే యున్నాడు.