ఈ పుట ఆమోదించబడ్డది

నుడువ బడినతోడనె జనులు గనుపఱచిన సంతోషము వర్ణింప దరముగాదు. ఒక్కెడ సభాసదుల కరాస్పాలనంబును, నొక్కెడ మహోత్సుకుల జయజయారావంబులును, వేరొక్కెడ 'లింకను పేర్కొనబడియెను. ఫిరంగుల మ్రోయించు' డను సేవకుల యార్భాటములును, మఱొక్కెడ తెరతెరలై వచ్చు ఫిరంగి శబ్దంబులును మిక్కుటముగ పిక్కటిలి యుత్సాహోదధి మితిమీఱి వెల్లివిరియుటం దెల్లము సేసెను.

ఈ విషయము దంత్రీవార్తమూలముగ స్ప్రింగుఫీల్డున విననాయెను. అచ్చటివారు మిక్కిలి యలరి లింకనునకు బూర్వాచారానుసరణముగ గొన్ని యుత్తమ సారాయిదినుసుల గొని కానుకగ నంపిరి. అతడు వానినెల్ల మరల బంపుచు మా యింట నిట్టి పదార్థ నెప్పుడు నుంచుకొనమని మీ రెఱుగుదురు గాదే" యని ప్రత్యుత్తరము నిచ్చెను.

ఆగౌరవమునకు బ్రతీకారముగ దనయింటికి గొందఱు ప్రముఖు లాథిత్య మంగీకరింప బ్రార్ధితు లైరి. అతడు దనకు సహజమగు సుస్వభావముచే వారి కెల్లరకు స్వాగతం బిచ్చి తన గృహమున దయామయుం డగు నీశ్వరు డిచ్చిన శుద్ధోదకమునకన్న బలవంతంబగు బానీయము లేదని పల్కి వారి యాయురారోగ్యములు దేవుడు హెచ్చించుగాత యని