ఈ పుట ఆమోదించబడ్డది

యాసురంబగు" నని యతడు మంట లెగయుమాటల విను వారల మనముల జ్వలింప జేయుచు ఖండన మొనర్చెను.

సీమ ప్రతినిధి సభ్యత్వమునకు బెనగుచు నచ్చటచ్చట నిత డిచ్చిన యుపన్యాసములు మహాద్భుతవిధమున లోకుల డెందముల కానందంబిచ్చి యితనియందలి గౌరవభావముం బెంచుచుండెను. ఒకనా డిత డుపన్యసించి ముగించిన తరువాత ననేకు లొక్కటిగ నితని భుజములపై నెక్కించుకొని కడుదూర ముత్సాహముతో గేకలు వైచుచు మోసుకొని పోయిరట. మఱియొకతఱి నొక ముదుసలి ప్రతిపక్షము వాడు లింకను వాక్యామృత మంతయు గ్రోలి తుట్టతుదకు మనస్సార జేతులుచఱచి యాహ్లాదమున మునిగితేలి తనపక్షము జ్ఞప్తికి దెచ్చుకొని,

"ఇతడు సెప్పు నంశముల నొక్కటైన నే నమ్మను. అయిన నితని వాక్సుధాలహరి కేను సంతసించి మెచ్చి తీర వలసి యున్నది. అది యేమిచిత్రమోగాని యీతని భాషణము లింతసొంపుగ నున్నవి." యనె నట.

ఇట్లున్నపదవి కేతెంచు కాలమున లింకను గుణముల జూపు విషయములు రెంటి నిందు గమనింపవలసి యున్నది.

ఒకదిన మతడు రాజకీయోద్యోగ స్థలము నుండి దిగి వచ్చుచు మెట్లమీద దన కక్షిదారు నొకని బొడగాంచి,