ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత నామె దన కుమారు లింకనున కప్పగించి యతడేమిచేసినను మంచిద యని యంగీకరించెను.

నిర్ణీతదినమునకు మధ్యకాలములో నాబ్రహా మైదువేల డాలర్లు వేతనముగ గొనినవానివలె శ్రమపడి సాక్ష్యవిశేషముల సమకూర్చుకొనుచు నితర సాహాయ్యముల జేర్చుకొను చుండెను.

విచారణదినమున న్యాయస్థానమున కనేకులు లగ్నహృదయు లాగతులైరి. వారు ప్రశాంత మనస్కులై మధ్య గొంతకాలము గడపియుండుటచే మొదటి దినములయందువలె సంభ్రమచిత్తులై యుండుట మాని న్యాయాన్యాయవివేచన సేయుటకు దగిన మనోవృత్తి గలవారై యుండిరి. పిర్యాదు పరము సాక్షులొక్కరివెంబడి నొకరు పరీక్షింపబడిరి. కొందఱు విల్లియము పూర్వపు దుష్ప్రవర్తన స్థిరపఱచిరి. మఱికొందఱు నేరము సమయమున దాము చూచినవిషయముల దెలుపుట కేతెంచిరి. పిర్యాదిమాత్రము విల్లియ మాయుధముచే నిహతుని జావనడచినది చూచితినని దృఢముగ బల్కెను.

అయిన నీపిర్యాదిని చమత్కారముతో బరీక్షించి లింక నందఱువెఱగంద బ్రతిపక్షమువారి వాదమె వారిపైకి ద్రిప్పెను. సాక్ష్య మతడు విమర్శించువఱకు నచ్చటివారెల్ల