ఈ పుట ఆమోదించబడ్డది

రుల దాకికొనుచుండ నందు మేట్సుగారను నతడు మృతినొందెను. అతని చావునకు హానా కుమారుడు విల్లియము గారణమని యానేరము మోపియుంచిరి. హానా మాత్రము దనకుమారుడుగాక మఱెవ్వడో యాపనిని జేసె నని నమ్మెను. ఆమె కథ నెల్ల సంపూర్ణముగ వినిపించిన తరువాత లింకనుగూడ విల్లియము నిరపరాధియని స్థాపింప లేకపోయినను నపరాధి యనుటకు దగినంత యాధారములు గానరాకుంట స్పష్టముగా గనెను. అందువలన నా ముదుసలిపై మిక్కిలి దయపుట్టి యాపె పట్టిని యురినుండి యెట్లైన రక్షింపవలె నని నిర్ధారణ సేసికొనెను. నేరస్తుని దండింపించవలె నను నుత్సాహ మపు డతివిస్తరముగ నుండుటంబట్టియు, నీ విల్లియమే దండనీయు డను వార్త వ్యాపించి యుండుటంబట్టియు నప్పటి స్థితియందు నిష్పక్షపాతులగు జ్యూరరులు (న్యాయసభలోని పంచాయితిదారులు) లభించుట గష్టతమ మనుట గుర్తించి యా వివాదపు విచారణ మఱియొక మాఱు మూడుమాసముల మీద జరుపవలసిన దని లింకను న్యాయవాదిని వేడి యట్లేసేయుటకు నుత్తరవు గొనెను. ఈ మార్గ మవలంభించుటకు హానా దనపుత్రు జూచుదత్తరమున నియ్యకొనకున్నను లింకను పై జెప్పినవిషయముల విశదీకరించి తన వివాదము జతపఱచుకొనుటకు గూడ నది సహకారి యగునని నుడివిన