ఈ పుట ఆమోదించబడ్డది

నని న్యాయాధికారికి జెప్పుము. నాహస్తము మాలిన్యంబు నందినది, కడుగుకొన నేతెంచితి" ననిదూత ననిపెను.

హత్య వివాదమున నొక్కట ముద్దాయిని రక్షించుటకై లింకను సీవెట్టులు నేమింపుకొనబడిరి. సాక్ష్యము విననతరువాత లింకనునకు దనపక్షమువాడు నేరస్తుడే యని తోచెను. వెంటనే ప్రక్కగదిలోనికి దన సహవాదింబిలిచి,

"సీవెట్టూ, మనవాడు నేరస్తుడే"యనెను.

"అందుకు సందియములేదని" సీవెట్టు ప్రత్యుత్తరమిచ్చెను.

"అతనిని నీవ రక్షించుకొనవలెను. నే నిక సాయ మొనర్పజాల" నని లింకను దన సదనమునకు వెడలెను.

సీవెట్టు మిక్కిలి చాతుర్యముతో వాదించి నేరస్తుని న్యాయశిక్షనుండి తొలగించెను. వాడు వేతనముగ న్యాయ వాదుల కని వేయిడాలరు లిచ్చెను. అయిన లింక నందొక్క వీసమైన గొనడాయెను.

ఒకనా డొక యబల యతని మందిరమునకు వచ్చి తనకు న్యాయము జరుప నతని నియమించుకొన గోరెను. ఆలోచన వేతనముగ రెండువందల యేబది డాలరుల చీటినిచ్చి మఱునాడు రమ్మన నంగీకరించి పోయెను.

రెండవరో జామె వచ్చునప్పటికి దగు విషయముల నెల్ల లింకను పరామర్శించి యుంచెను. ఆమె వచ్చినతోడనె