ఈ పుట ఆమోదించబడ్డది

'బానిసము మానుద' మని యొక పత్రిక ప్రచురించి నందులకు గుండు దెబ్బ గుడిచి లోకాంతర గతు డై యుండెను.

ఇట్టి సమయమున జట్టనిర్మాణసభయందు దాస్యపరులైన కొందఱు దాస్యనిర్మూలకులకు వ్యతిరిక్తముగ గొన్నిచట్టముల నిర్మింప గట్టిగ బ్రయత్నంచిరి. బానిసతనము ప్రవృద్ధియగుటకు వలయుసాధనముల నేర్పఱుప జూచిరి. ఈ కార్యములు మిక్కిలి హేయములై యెట్టికట్టడీ బానిససీమకును నపకీర్తి తే గలిగియుండెను. అయిన దాస్యనిర్మూలకుల జడిపించి తమ కార్యము నెరవేర్ప బూనిరి. అనేకుల నాప్రకారము దమ వశుల జేసికొనిరి. ఆబ్రహాము మాత్రము లోబడకుండెను. మిక్కిలి కోపోద్దీపితు డై యా చట్టములనెల్ల సంపూర్ణముగ ఖండించెను. దాస్యపరులను వారికార్యములను బట్టరాని యుగ్రతతో నిరాకరించెను. దాస్యనిర్మూలకులలో నొక్కడు డాను స్టోను మాత్ర మతని జేరును. వీ రిరువురును జాగరూకతతో నొక విరుద్ధాబిప్రాయపత్రిక వ్రాసి యాచట్టము లన్యాయము లనియు లసంగతము లనియు ఖండించి యాసభ జర్చావిషయిక సంగ్రహపట్టికల లిఖింపించిరి.

1836 మొదలు 1838 వఱకు నా సభయందు స్వాతంత్ర్యమునకై వాదించుటం జేసి లింకను నిర్భయముగ మహా