ఈ పుట ఆమోదించబడ్డది

లమునం దాబి స్నేహితులెల్లరు నానందం బందిరి. అందఱు నతనికి సాహాయ్య మొనర్ప సిద్ధపడిరి. అతని వా గమృతంబున నోలలాడు మిత్రు లనేకు లతని విద్యాపరిశ్రమ దమ సౌఖ్యము జెఱచునని తలంచిరి. కొల్తపని జూచుకొనుచు న్యాయవిద్య గడించుట యనిన నెంత పరిశ్రమ, పట్టుదల, సౌఖ్యనిరసనములు గావలయునో వా రెఱు గరైరి. అయినను

శా. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంతప్తులై
   యారంభించి పరిత్యజింతు రురువిఘ్నా యత్తులైమధ్యముల్
   ధీరుల్విఘ్ననిహన్యమానులగుచున్ధృత్యున్న తోత్సాహులై
   ప్రారబ్ధార్థములుజ్జగింపరుసుమీప్రజ్ఞానిధుల్ గావునన్."

లింకను స్నేహితులతో వినోదప్రసంగముల నుండుట మాని వేసెను. ప్రతిసాయంకాలమును దేహపరిశ్రమ సేయుచుండు వాడు.. అద్దానినిగూడ వదలవలసినవా డయ్యె.పుస్తుకములకై యప్పుడప్పుడు స్ప్రింగుఫీల్డుకు నిరువదిమైళ్లు నడచిపోయి పెద్దపెద్ద గ్రంథముల నవలీలగ మోసికొనివచ్చుచు మార్గము నందె గొంతభాగము పఠింప దొడగెను. కొల్తపనుల బగలంతయు నొక్కొకతఱి గడపవలసి యుండును. అపుడు రాత్రి వేళల బహుకాలము చదువును. ఈవిధమున బట్టినపట్టు వదలక యనేకులు తరుణవయస్కులు వినోదముల నాటలు బాటల