ఈ పుట ఆమోదించబడ్డది

గ్రీను "లింకను సారా పీపా నెత్తి దానిలోని రంధ్రమునుండి జారు ద్రావకము నాస్థితియంద త్రాగు" ననెను. వివాదకు లిరువురు పందెములు వైచికొని లింకను దగ్గరకు వచ్చిరి. లింకను దన మిత్రుమాట సెల్లింప నతడు సెప్పినట్లు లఘువుగ బీపాయినెత్తి ద్రావకము నోట బోసికొనెను. గ్రీను పరపక్షపు టతనికి 'జూచితివే' యని సంతసింపుచుజూపి, లింకను జూచి "నీవు త్రాగువాడవు గావే" యనుచుండ నోటనుండిన హాలారసమును నేల నుమిసి "నే నెప్పటికిని ద్రాగను, ఇప్పుడును ద్రాగలేదు. నీమాట నడపుట కింతమాత్రమునకైన నియ్య కొంటి" నని నుడువుచు బీపాయి గ్రింద దింపెను. ఆ మూడవవా డట్టి యాశ్చర్య మెన్నడును జూడలే దని వెఱగుపడి చూచుచుండెను.

చదువరులారా! మనము ముఖ్యముగ గమనింపవలసినది యాబ్రహాము మనస్థైర్యము, దుష్టవస్తువును దూరముగ నుంచు దిట్టతనము. సురాపానము నత డెంత నిరసించినదియు గల గరే. ఇంతటితో నతడు నిలువలేదు. సాయంకాలమున గ్రీను నేకాంత స్థలమునకు బిలిచి పందెములు వేసికొనుట జూదముతో సమానమని చీకొట్టి యా దురభ్యాసము నికముందు వదలివేయుమని బోధించెను. లింకనుపన్యసించిన విని ------------ యపరాధము -------------