ఈ పుట ఆమోదించబడ్డది

దుస్సాధ్యము. పౌరుల నొక కట్టుగ జేర్చినందునను వారికి యుద్ధభటత్వమును సంప్రాప్త మయి యుండినందునను వారు లాభనష్టముల నెఱుంగునంతటి స్థితిలో నుండరైరి. వారి నిర్ణీతకాలమును నంతమందుచుండెను. కావున వారినేరములు పైవారికి దెలియ జేయుట దన గార్యనిర్వాహశక్తి కే లోపముగ గన్పట్టు. అందువలన నతడు దన స్వశక్తి స్థైర్యంబుల జూపుటయె యతని గాపాడెను.

ఈ పటాలము ముప్పదిదినము లైనతోడనే విడదీయ బడెను. ఎవరింటికి వారు వెడలిరి.. అయిన లింకను మఱిరెండు పటాలముల నుద్యోగముల గొనెను గాని యెచ్చటను అతడు దన యోధశక్తి జూపినదిలేదు. ఈ విషయమునుగుఱించి లింకను మిక్కిలి చమత్కారముగ బలికియున్నాడు. దేశాధ్యక్షత కతడును జనరల్ క్యాసును బ్రయత్నించుచుండిరి. క్యాసు పక్షపువా రత డీయుద్ధమున మిక్కిలి పాటుపడెనని యొక్కవిధమున జాటుచుండిరి. దానినిగుఱించి దేశీయ మహాసభలో ముచ్చటించుచు లింక నీవిధముగ నుడివి యున్నాదు.

అయ్యలారా నేను వీరాగ్రేసరు డైనది మీ రెఱుగరా? వినుడి నేనగుదు. బ్లాక్‌హాక్ యుద్ధమపుడు నే సమర మొనర్చి నా రక్తము గొంత యర్పించి యిలువచ్చి చేరితిని. జనరల్ క్యాసి గారి కార్యముల జర్చించునెడ నా కార్యము