ఈ పుట ఆమోదించబడ్డది

యొక కాలుపౌను తూచి యంగడి తలుపువేసి యా నెలత యింటికఱగి తేయాకు నిచ్చివచ్చి తన యుద్యోగమునకు బూనెను.

ఇట్టి సన్మార్గ ప్రవర్తన లింకనునకు గౌరవస్నేహముల వృద్ధి పఱచినదేగాక యా యంగడి కనేకుల బేరగాండ్ల రప్పించి యాపుట్టుకు లాభము మెండుగ గలుగ జేసెను.

గిడ్డంగిదారు డనిన నాగ్రామమున మిక్కిలి యాదరణ. అందున నుత్తమ గుణసంపత్తిచే నొప్పి విద్యాదికములచే నలంకరింపబడిన లింకనును గారవించనివా డెవడు? ఆగ్రామమ నందలి కలహముల దీర్ప నీతడె న్యాయాధిపతిగ గణింప బడుచుండెను. నిష్పక్షపాతముగ నేకార్యము జరగవలసినను నిరువాగులవారును దమదమ దు:ఖముల నితనికి జెప్పుకొని యితని తీర్మానముల నడపుచుందురు.

ఉపాధ్యాయుదు గ్రేహము లింకనును బ్రాణస్నేతుడుగ జూచుచుండును. అతనియొద్ద లింక నింగ్లీషువ్యాకరణ మభ్యసించుటకు బూనెను. వ్యాకరణపాఠమనిన ననేకులకు విద్యార్థులకు దలకంటగించును. లింక నిద్దాని నొప్పుకొనినను విద్య సంపాదింప నుద్యమించు ధీరుడుగాన నెట్టి కాఠిన్యమును నతని నెదుర్చలేకుండెను.

శిధిల వ్యాకరణగ్రంధ మొకదాని నెచటనో సంపాదించుకొని సమయము వేచి యొక నిమిషమాత్రము కాలము