ఈ పుట ఆమోదించబడ్డది

నెక్కిపోవ నేర్పఱచెను. కొంతదూర మరిగినతరువాత నాపుట్టు లింకనును న్యూసేలమున నుండు దన యంగడిలో గిడ్డంగిదారుడుగా నుండవలె నని యడిగెను. అందు కతడు దన కాపనికి వలయుశక్తి లేదనియు శక్తి యుండిన సంతసమున జేసి యుండుదుననియు బ్రత్యుత్తర మిచ్చెను. ఆపుట్టు లింకను శక్తిసామర్థ్యంబు లెఱిగినవాడు గావునను అతనియందు దన యందువలె నమ్మకము గలవాడు గావునను "నీ కదియెల్ల మిక్కిలిసులభసాధ్యము. నీ వొక్కమాట నుడివితివేని నేను నీ కచట సర్వాధికార మిచ్చెదను. నాకు నీవలన నెంతటిపనియైన గాగల దమనిశ్చయము గలదు. ఇయ్యకొను" మని పలికి యతని యంగీకారమున గొని తల్లిని దో బుట్టువులను జూచివచ్చుట కత డింటికి వెంటనే పోయిరా సెలవిచ్చెను.

ఆబ్రహా మిలు సేరిన కొన్ని దినముల కతనితో బోర నిచ్చ యొడమి యొక మల్లు డచటి కేతెంచి భుజాస్ఫాలనంబుసేసి కుస్తీకి రమ్మని పిలిచెను. లింకను దనకంత పరిశ్రమ లేదనియు బోర నుద్యమింపననియు జవాబు చెప్పెను. చెప్పినను విడువక యాజెట్టి యాబ్రహామును వెన్నంటెను. తుట్టతుద కత డియ్యకొని నిర్ణీతస్థలమున వానినెదిరి సునాయాసముగ రెండుమాఱులు సంపూర్ణజయము గొనెను. ఆయోదుని ---- మిక్కిలియవమానకారియై కోపానలంబును బ్రజ్వరిల్ల