ఈ పుట ఆమోదించబడ్డది

టకు మార్గము గన నెన్నివారములు పట్టునో యని కుందు చుండెను. ఆబ్రహాము మాత్రము ధైర్యమున దనపని దా జేయ దొడగెను. ఆపుట్టున కభయమిచ్చి తమ పడవలోని సరకుల నింకొక పడవలోనికి దీయింపించెను. తరువాత నానకట్టమీది కెగసిన యోడభాగపు టడుగున నొకబిల మొనర్చి యాబిలద్వారమున లోపలినీరు వెలువడువఱకు నీటిలోనిభాగమును గొంచెముగొంచెముగ గదలించుటకు దగు కొన్ని యుక్తుల బన్నెను. పడవలోనిజలమంతయు గ్రుమ్మరించిన పిదప నా బిల మొక్కనిమిషమున మూయబడియెను. పడవ యెప్పటి యట్ల నీట దేల నారంభించెను. సరకులనెల్ల మరల నెక్కించుకొని ప్రయాణము సాగింప మొదలిడిరి. ఆపుట్టు సంతోషమునకు మితి లేకుండెను. చూచువారల యాశ్చర్యమును దట్టమై సంతోషారావముల వెలువడియెను. ఎచ్చట జూచిన నాబ్రహాము బుద్ధికుశలతకు మెచ్చి జనులు గొట్టు చప్పట్లధ్వని యాపుట్టు వీనుల విందుచేసెను. అతడు మిక్కిలి యుత్సాహమునకు లోనై "నే నిలుసేరినతోడనె నొక పొగ యోడ గట్టించి దానికి నాబ్రహాము నధ్యక్షుని జేసెద"నని యఱచెను.

ఈ యపాయకర మగు ననుభవ మాబ్రహాము మనమున బనిచేయ బ్రారంభించెను. ఇట్టి కష్టములపాలుగాక పడవలు