ఈ పుట ఆమోదించబడ్డది

యను నంశము. విశేషము పాటుపడి యీవిషయమునకు వలయు సాధనముల సమకూర్చుకొని యుండెను. ఇందియను లనిన నతనికి మిక్కిలి వైరము. వారు దన పూర్వికుల గాసి బెట్టిరే యనుకిన్క యతని మనమున నాటియుండినను ఇందియనుల నన్యాయముగ బాధపెట్టుచుందు రనిమాత్రము నొక్కి చెప్పుచుండును.

అయిన నీగ్రోల దుర్దశ దుర్భరమని యతడు చక్కగ గ్రహించెను. కావున వారి గష్టముల మాన్పి వారికి స్వేచ్ఛా విహార మొసంగవలె నని నాడు మొదటి యుపన్యాసము చేసెను.

ఈ యుపన్యాసమల వినుచుండిన ముదుకలి యొకతె మిక్కిలి యుత్సాహముతో "నాబి యునైటెడ్ రాష్ట్రపు దేశాధ్యక్షు డగున" నెనట!

1830 వ సంవత్సరము జనవరినెల ప్రారంభ మగునప్పటికి థామసు 'ఇల్లినాయి' సీమకు వెడల నిశ్చయించుకొనెను. ప్రయాణ ప్రయత్నములు సేయబడెను.

ఆబి యప్పటి కిరువదియొకసంవత్సరములవాడు. తల్లి దండ్రులనిన నతనికి గడు ప్రీతి. కాన నా యాత్రకు దా లేనిది వారు పూనుట తగదని తోప దానును వారితోడన పోవ నిశ్చయించుకొనెను. ఎంత ---------------------