ఈ పుట ఆమోదించబడ్డది

రీకరింపబడినవి. జాన్ స్టుఅర్ట్ మిల్, హర్‌బర్ట్ స్పెన్సర్, సర్ జాన్ లబక్ మొదలయిన యింగ్లీషు గ్రంథకారు లనేకులు మహారాష్ట్రవేషముల వేసియున్నారు. ఇట్టిరూపాంతరీభూతగ్రంథంబులు గాక స్వతంత్రగ్రంథంబు లనేకములు ప్రతిసంవత్సరమును నాభాషయందు వెలువడుచున్నవి. ఇట్టి శాస్త్ర చరిత్రవిజ్ఞానవిషయిక నూతనగ్రంథంబుల బ్రచురించుటకు నాభాష యందు రెండువందలపుటల మాసపత్రిక యొకటి 'గ్రంథమాల' యనునది గలదు. దిని సంపాదకుడు (Editor) విష్ణు గోవిందవిజాపురకర్, ఎం.ఏ., అను విద్వాంసుడు. మహారాష్ట్రదేశచరిత్రకు గావలసినసాధనంబుల సేకరించి, మరాఠ్యాంచ్యా ఇతిహాసాచీ సాధనే, (మహారాష్ట్రులచరిత్రకు సాధనములు) అను పేరిట బ్రచురించుటయే తనకర్తవ్యముగా నెంచు స్వార్థత్యాగియైన మహానుభావు డొకడు మహారాష్ట్రదేశమున గలడు. ఈమహాపురుషునినామము విశ్వనాథ కాశీనాథ రాజవాడే, బి.ఏ. ఈయన గొప్పవిద్వాంసు డైనను ఇతర యుద్యోగముల కాశింపక నెలకు నిరువది రూపాయలు వచ్చు పూర్వార్జితమైనసొత్తుతోనే జీవనము గడుపుచు, వివాహము జేసికొనక, మంచి త్రోవలైనను లేని పల్లెలకు గూడ జరిత్రసాధనంబు లున్నవని తెలసిన నడచి వెళ్లి నెలలకొలది యచ్చట నుండి, వంటతానే చేసికొనుచు, నెన్నియో యితరకష్టముల కోర్చి దొరికినసాధనములకు బ్రతులు వ్రాసికొని ప్రచురించుచుండును. ఇట్లు స్వదేశచరిత్రమునందే దృష్టి నిలిపిన యీయోగి యిదివఱకు నెనిమిదిసంపుటముల బ్రచురించెను. ఇంక నెన్నియో సంపుటములకు సరిపోవు నన్ని సాధనముల సేకరించియున్నాడు. అందువలన నిప్పుడు మహారాష్ట్రీయుల చరిత్రసంబంధమైన విశ్వాసార్హము లగు సాధనములు, మూలప్రతులు మొదలయినవి, వెలువడి పరదేశీయులు వ్రాసిన చరిత్రములలోని యసత్యాంశముల బయలుపఱచుచున్నవి.

ఇట్లు మన యిరుగుపొరుగువారు తమతమ దేశభాషల నభివృద్ధి చేసికొన నవిశ్రాంతముగా స్వార్థమునందును దృష్టియుంచక పాటుపడుచుండ