ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15. పద్మకోశహస్తలక్షణమ్

అఙ్గుళ్యో విరళాః కిఞ్చిత్
కుఞ్చితా స్లనిమ్నగాః,
పద్మకోశాభిధో హస్త
స్తన్నిరూపణముచ్యతే.

319

తా. అయిదువ్రేళ్లను ఎడముగా చాఁచి కొంచెము వంచి అరచేయి పల్లమగునట్టు పట్టఁబడునెడ పద్మకోశహస్త మగును.

వినియోగము

ఫలేబిల్వకపిత్థాదౌ స్త్రీణాంచ కుచకుమ్భయోః,
వర్తులే కందుకే స్వల్పభోజనే పుష్పకోశకే.

320


సహకారఫలే పుష్పవర్షేమంజరికాదిషు,
జపాకుసుమభావే౽పిఘంటారూపవిధానకే.

321


వల్మీకే కుముదే౽ప్యండే పద్మకోశో౽భిధీయతే,

తా. మారేడుపండు, వెలగపండు, స్తనములు, వట్రువ, చెండు, అల్పాహారము, పూమొగ్గ, మామిడిపండు, పూలవాన, పూగుత్తి మొదలగునది, మంకెనపువ్వు, ఖంటారూపమును జూపుట, పాములపుట్ట, నల్లకలువ, గుడ్లు వీనియందు ఈహస్తము ఉపయోగించును.

గ్రంథాంతరస్థపద్మకోశహస్తలక్షణమ్

వరశ్వేతామ్బుజాకారః పద్మకోశో౽భిధీయతే.

322


చక్రార్థే పద్మనికరైశ్శమ్భుపూజాం వితన్వతః,
నారాయణా త్పద్మకోశో జాతః పద్మధరోఋషిః.

323