ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తర్జనే నీచసంబుద్ధౌ శ్రవణే విరహేస్మృతౌ,
ఘ్రాణే చఞ్చ్వాం శ్వేతవర్ణే దర్శనే సూచికః కరః.

317

తా. శ్లాఘించుట, నిజము, దూరమును జూపుట, ప్రాణమనుట, ముందుగఁబోవువానిఁ జూపుట, ఒకటి అనుట, సంధ్యాకాలము, ఏకాంతప్రదేశము, తూడు, బాగనుట, చూపు, అట్లే యనుట, లోకము, పరబ్రహ్మనిరూపణము, ఒకటే యనునర్థము, సలాక, చక్రమును త్రిప్పుట, సూర్యుఁడు, ఉదయాస్తసమయములు, ఋణము, రహస్యముగ నాయకుని జూపుట, అలుగు గలబాణము, ఏది అది అనుట, ఇనుము, కమ్మి, జెదరించుట, నీచుని పిలుచుట, వినుట, విరహము, తలఁచుట, ముక్కు, పక్షిముక్కు, తెలుపు, చూచుట వీనియందు ఈహస్తము వినియోగపడును.

14. చన్ద్రకలాహస్తలక్షణమ్

వినియోగము:—

సూచ్యామఙ్గుష్ఠమోక్షేతు
భవేచ్చన్ద్రకలాకరః,
ఏషాచన్ద్రకలాచన్ద్ర
కలాయామేవయుజ్యతే.

318

తా. ముందు చెప్పిన సూచీహస్తమునందు బొటనవ్రేలిని విడిచినయెడ చంద్రకలాహస్త మగును. ఈ చంద్రకలాహస్తము కలామాత్రచంద్రునియందు వినియోగింపఁబడును.