ఈ పుట ఆమోదించబడ్డది

5

శిష్యులయొక్క సేవ్యసేవకభావబోధకములేగాని యితరములు కావు అని బ్రహ్మాదులచేత చెప్పబడియున్నది కనుకను, ధర్మార్థకామమోక్షము లనెడి చతుర్విధ పురుషార్థములకును సాధకమును, సర్వోత్కృష్టమును దేవతాది కర్తృకమును నైన యీ భరతశాస్త్రము ఎల్ల ధముల తను మనకు పరిగ్రహణీయమును అభ్యసనీయము నగుచు అని విచారించి, కాలానుసారముగా దినే నే క్షీణదశ నొందుచున్న దీనిని యథోచిత ప్రచారామునకు తేదలచి, భరతకర్తలలో నొకరగు నందికేశ్వరుని జెప్పబడిన ' యభినయదర్పణము ' అను గ్రంథమును పతాకా ముఖ్యహస్తముల స్వరూపములను దెలిపెడి చిత్రపు గురుతుల నాయాహస్తముల లక్షణశ్లోకములకు మొదటజేర్చియు, గ్రంథాంతరములందు జెప్పబడిన ఆయా హస్తముల యుత్పత్తికాలము, ఋషిదేవతాజాతి వర్ణములు మొదలగువాని గూర్చియు విశేషసంయుత హస్తములను, ప్రసిద్ధ రాజుల హస్తములను, పుణ్యనదుల హస్తములను, అశ్వత్ఠాది వృక్షహస్తములను, సింహాది మృగహసములను, హంసాదిపక్షిహస్తములను వక్రాదిజంతుహస్తములను, శిరోభేదాద్యనేక విషయములను సంగ్రహించియు నిట్లు చేరిన నన్నూట యెనిమిది విషయములను తెలుపునట్టి శ్లోకములకు స్త్రీ బాలబాలికాదులకు గూడ తేటగా దెలియునట్లు సులభములైన మాటలతో తెనుగు తాత్పర్యము వ్రాసి మంచి అక్షరములతో ముద్రింపించితిమి.