ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. నాలుగు వ్రేళ్లను జేర్చి యరచేతిలోనికి వంచి యంగుష్ఠమును మీఁదఁ జేర్చునెడ ముష్టిహస్త మగును.

వినియోగము:—

స్థిరేకచక్రహేదార్థ్యేవస్త్వాదీనాంచ ధారణే.

273


మల్లానాంయుద్ధభావేచ ముష్టిహస్తో౽యముచ్యతే,

తా. స్థిరమనుట, సిగబట్టుట, దృఢత్వము, పదార్థములఁ బట్టుకొనుట, జెట్టీలజగడము వీనియందు ఈముష్టిహస్తము వినియోగింపఁబడును.

గ్రంథాంతరస్థముష్టిహస్తలక్షణమ్

మధ్యోపరికృతాంగుష్ఠో ముష్టిర్ముష్ట్యాకృతిఃకరః.

274


మధుకైటభయోర్యుద్ధేజాతోవిష్ణోరయంకరః,
అమరేంద్రోఋషిర్నీలశ్శూద్రశ్చంద్రో౽ధిదేవతా.

275

తా. నడిమివ్రేలిమీఁద అంగుష్ఠమును మడిచి పిడికిలి పట్టఁబడెనేని యది ముష్టిహస్త మగును. అది విష్ణువు మధుకైటభులతో యుద్ధము చేయుకాలమందు విష్ణువువలన పుట్టెను. ఇది శూద్రజాతి. దీనికి ఋషి అమరేంద్రుఁడు. వర్ణము నీలము. చంద్రుఁడు అధిదేవత.

ఆలమ్బనేమధ్యభావే ఫలే సఙ్కేతభావనే,
భద్రార్థే బలిదానేచ ప్రణామే ప్రాకృతైఃకృతే.

276


ఊరుసంవహనే ఘంటాగ్రహణే౽తి ప్రధావనే,
లాఘవే మల్లయుద్ధేచ ఖేటకాదిగ్రహేస్థిరే.

277


కచాకర్షే ముష్టిఘాతే గదాకున్తాదిధారణే,
నీలవర్ణే శూద్రజాతౌ ముష్టిహస్తో౽యముచ్యతే.

278