ఈ పుట ఆమోదించబడ్డది

4

యనియు, శిష్టులకు పరిగ్రహణీయము కాదనియు, నాట్య ప్రవర్తకులకే యభ్యసనీయమనియు నుల్లంఘించి యున్నారనుట యెల్లవారికిని తెల్లమే కదా ? మోక్షసాధక మగు యోగశాస్త్రమును బోలిక యీశాస్త్రము ఇట్టి దశకు వచ్చుటకు నాయికానాయకవ్యాపారములను తదంగములయిల యితర విషయములనుజూచి ధర్మనునందు ప్రవృత్తి గలుగ జేయుటయే గాక గూడార్థప్రదర్శకములై, ఆంగికాభినయము వలన రసికులకు నభిజ్ఞఉలకు నానందప్రదమై యట్టి రసికాగ్రగణ్యులచే నాయభినయ విద్యాప్రవీణులు సన్మానింపబడు విషయము కేవల నటీప్రేష్యముగా నెన్నంబడుటయు, జనుల మనసులందు దోచు విషయములను అంగచలనాదౌల దెలిసికొనుట వలన కామవికారము కలుగునను భ్రాంతియును కారణము లగుచున్నవి. అట్లుగాక సూక్ష్మదృష్టితో చక్కగా విచారించునెడల ఈశాస్త్రము శృంగార సాధిష్ఠాన దేవతల లోకజనకుడు నగు శ్రీకృష్ణదేవుని లీలావినోదములను ఆయా రసానుభవమౌలతోడా నూహించి తెలిసికొనుట వలన బ్రహ్మజ్ఞానమును, ఆ జ్ఞానము వలన చూడబడునని యన్నియు అస్థిరములయిన వ్యాపారములు అను తాత్పర్యమును, ఆ తాత్పర్యము త అట్టి వ్యాపారములందు విరక్తియు, శాంతిదాంత్యాది విశిష్టగుణములును, జనింపగా నిత్యసుఖప్రదమయిన బ్రహ్మానందమును బొందించు నను విషయము తేటపడును , నాయికానాయకవ్యాపారములు జ్ఞాన పార్జనము నందు గురు