ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కపోలేపత్రలేఖాయాం బాణార్థే పరివర్తనే.

228


స్త్రీపుంసయోస్సమాయోగే యుజ్యతే త్రిపతాకకః,

తా. కిరీటము, వృక్షము, వజ్రాయుధము, ఇంద్రుఁడు, మొగలిపువ్వు, దీపము, అగ్నిజ్వాల పైకిలేచుట, చెక్కిలి, మకరికాపత్రరేఖ, బాణము, మార్పు, స్త్రీపురుషులచేరిక వీనియందు ఈ హస్తము వినియోగించును.

గ్రంథాంతరే త్రిపతాకహస్తలక్షణమ్

పతాకే౽నామికావక్రాత్రిపతాకకరోభవేత్.

229


శక్రేణా౽౽దౌ యతోవజ్రం పస్పర్శే౽నామికాంవినా,
పతాకస్య త్రిభాగేన త్రిపతాక ఇతిస్మృతః.

230


వాసవాత్త్రిపతాకో౽యం జజ్ఞే తస్య ఋషిర్గుహః,
రక్తవర్ణో క్షత్రజాతిరధిదేవో మహేశ్వరః.

231

తా. క్రింద చెప్పఁబడిన పతాకహస్తమందు అనామిక (ఉంగరపువ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్త మగును. ఆదికాలమందు దేవేంద్రుఁడు వజ్రాయుధము నెత్తుకొనునపుడు అనామికను వదలి పతాకముయొక్క మూఁడుభాగములచేత గ్రహించుటచే నేర్పడినది కనుక ఇది త్రిపతాకము అనఁబడెను. ఇది ఇంద్రునివలన పుట్టినది, ఎఱ్ఱవన్నె గలది, క్షత్త్రియజాతి, దీనికి ఋషి గుహుఁడు, అధిదేవత శివుఁడు.

వినియోగము:—

ఆవాహనే౽వతరణే వదనోన్నమనే నతౌ,
స్పర్శేశుభానాం ద్రవ్యాణామఙ్కనే౽నాదరేఖలే.

232


సన్దేహే మకుటే వృక్షే వాసవే కులిశాయుధే,