ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. నాట్యారంభము, మేఘము, వనము, వస్తువులను నిషేధించుట, కుచస్థలము, రాత్రి, నది, దేవసమూహము, ఆశ్వము, ఖండించుట, వాయువు, శయనము, గమనము, ప్రతాపము, ప్రసాదము, చంద్రిక, మిక్కిలియెండ, తలుపుతట్టుట, ఏడువిభక్తులు, అల, వీథిలో ప్రవేశించుట, సమముగా నుండుట, గందము పూయుట, తాననుట, పంతము, ఊరకుండుట, ఆశీర్వదించుట, గొప్పరాజును జూపించుట, తాటాకు, చెంపపెట్టు, పదార్థమును స్పృశించుట, అక్కడనే యక్కడనే యనుట, సముద్రము, సుకృతిక్రమము, సంబోధనము, ముందుగాఁ బోవువాఁడనుట, కత్తియాకృతిని జూపుట, మాసము, సంవత్సరము, వర్షము, దినము, సమ్మార్జనము, (అనఁగా తుడుచుట) ఈఅర్థములయందు ఈహస్తము వినియోగపడును.

గ్రన్థాంతరస్థపతాకలక్షణమ్

సంలగ్నః తర్జనీమూలే యత్రా౽ఙ్గుష్ఠో నికుఞ్చితః,
ప్రసారితతలాఙ్గుళ్యః పతాకః ప్రభవేత్కరః.

215


ఏకాకినాపురాధాత్రా పరబ్రహ్మ సమాగమే,
జయేతి స్తుతివేళాయాం పతాకస్యా౽౽కృతిః కరః.

216


యతో భేజే తతో లోకే పతాక ఇతి విశ్రుతః,
అతఏవ సమస్తానాం హస్తానా మయమాదిమః.

217


పతాకో బ్రహ్మణోజాతః శ్వేతవర్ణో ఋషిశ్శివః,
బ్రహ్మజాతి ర్భవేత్తస్య పరబ్రహ్మా౽ధిదైవతమ్.

218

తా. తర్జనీమూలమందుఁ జేర్చి వంచఁబడిన బొటనవేలును, చాఁచఁబడిన అరచేయియు, వేళ్లునుగలది పతాకహస్త మనఁబడును. ముందు బ్రహ్మ యొంటరిగా పరబ్రహ్మను చేరఁబోయినప్పుడు పతాకాకృతిగా చేయి చాఁచి ‘జయవిజయీభవ’యని స్తోత్రము చేసెను. ఆకారణముచేత అట్లు