తా. శృంగారనటనమునందును, స్త్రీల చెక్కిళ్లు ముద్దు పెట్టుకొనుటయందును ఈ గ్రీవ యుపయోగించును.
4. ప్రకమ్పితము:—
| పురఃపశ్చాత్ప్ర్పచలనాత్కపోతీకణ్ఠకమవత్, | 186 |
తా. పావురాయి మెడ కదలించునట్లు ముందు వెనుకలుకుఁ గదలింపఁబడునది ప్రకంపితగ్రీవ యనఁబడును.
వినియోగము:—
| యుష్మదస్మదితిప్రోక్తే దేశీనాట్యవిశేషకే, | 187 |
తా. నీవు నేను అనుటయందును, దేశీనాట్యమునందును, ఉయ్యెలయందును, లెక్కపెట్టుటయందును, ఈ గ్రీవ యుపయోగింపఁబడును.
అథ ద్వాదశహస్తప్రాణలక్షణం నిరూప్యతే.
| హస్తానాం ద్వాదశ ప్రాణాస్తేషాం లక్షణముచ్యతే, | |
తా. హస్తప్రాణములు పండ్రెండు, వానిలక్షణము చెప్పఁబడుచున్నది.
| ప్రసారణం కుంచితఞ్చ రేచితం పుఙ్ఖితం తథా. | 188 |
| అపవేష్టితకంచా౽పి ప్రేరితోద్వేష్టితే తథా, | 189 |
| చిహ్నం పదార్థ టీకేతి ప్రాణా ద్వాదశహస్తజాః, | |
తా. ప్రసారణము, కుంచితము, రేచితము, పుంఖితము, అపవేష్టిత