వినియోగము:—
| రహస్యశ్రవణేసాధు కలనే పదవీక్షణే. | 178 |
తా. ఇది రహస్యమును వినుట, మంచిది అనుట, స్థానవీక్షణము వీనియందు చెల్లును.
6. కుంచితము:—
| ఏకావాసా ద్వితీయావా కుంచితాంచితవా మతా, | |
తా. ఒక కనుబొమ్మయేని రెండు కనుబొమ్మలేని ముడిగింపఁబడినయెడ అది కుంచితభ్రు వనఁబడును.
వినియోగము:—
| మోట్టాయితే కుట్టమితే విలాసే కిలికించితే. | 179 |
తా. ఇది మోట్టాయితము, కుట్టమితము, విలాసము, కిలికించితము అను శృంగారచేష్టావిశేషములందు వినియోగింపఁబడును. మోట్టాయితము మొదలగు వానియర్ధము భరతరసప్రకరణమందు వివరింపఁబడియున్నది.
అథ చతుర్విధ గ్రీవాభేదానిరూప్యంతే.
| సుందరీ చ తిరశ్పీనా తధైవ పరివర్తితా, | 180 |
తా. సుందరి, తిరశ్చీన, పరివర్తిత, ప్రకంపిత అని గ్రీవా(మెడ)భేదములు నాలుగువిధములు.
1. సుందరి:—
| తివ్యక్ప్రచలితా గ్రీవా సుందరీతి నిగద్యతే, | |
తా. అడ్డముగాఁ గదలింపఁబడినది సుందరీగ్రీవ యనఁబడును.