ఈ పుట ఆమోదించబడ్డది

నల్లగ్రుడ్లును వంచఁబడిన రెప్పలును గలచూపు హృద్యదృష్టి యనఁబడును. ఇది మధ్యమములైన వస్తువులయందు చెల్లును.

44. లలితము:—

భ్రూక్షేపకుంచితాపాఙ్గా స్మి తేనా౽నంగసంభువా.

171


వికాసేనా౽న్వితాదృష్టిః లలితాలలితాదిషు,

తా. కనుబొమ్మలకదలికచే ముడుగఁజేయఁబడిన కడకన్నులు, మన్మథవికారమువలని చిరునవ్వును, తేటదనమును గలది లలితదృష్టి యనఁబడును. ఇది ఆనందకరములైన వస్తువులయందు చెల్లును.

అథ గ్రంథాన్తరస్థభ్రూభేదానిరూప్యంతే.

సహజా పతితోత్క్షిప్తా చతురా రేచితా తథా.

172


కుంచితేతి షడేవా౽త్ర భూచాతుర్యవతిక్రియాః,

తా. సహజ, పతిత, ఉల్లిప్త, చతుర, రేచిత, కుంచిత అని భ్రూభేదములు (కనుబొమలచతురత్వము గలక్రియలు) ఆరువిధములుగాఁ జెప్పఁబడుచున్నవి.

1. సహజము:—

సహజాస్యాత్స్వభావభ్రూఃవికారరహితా ముఖే.

173


సహజాదిషు యుజ్యేత ఇతి భావవిదో విదుః,

తా. ముఖమం దేవికారమును లేక స్వాభావికముగనుండెడి కనుబొమ్మ సహజభ్రువనఁబడును. ఇది స్వభావము మొదలైనవానియందు చెల్లును.

2. పతితము:—

అచంచలభ్రూయుగంచ పతనాత్పతితామతా.

174

తా. చలింపని కనుబొమ్మలను వాల్చిన పతితభ్రువగును.