సరిగా మీఁది కెత్తఁబడిన రెప్పలుగలది త్రస్తదృష్టి యనఁబడును. ఇది భయమందును మదమునందును చెల్లును.
33. మ్లానము:—
| శిథిలాచార్ధచలనాత్ క్రమాన్నిర్భుగ్నతారకా. | 160 |
| పక్ష్మాగ్రభ్రూపుటామ్లానాయోజ్యామ్లానాదికేష్వియమ్, | |
తా. సడలి, కొంచెపుకదలికతో క్రమముగా సోలుచున్న నల్లగ్రుడ్లు గలిగి రెప్పలకొనలనంటుచున్న కనుబొమ్మలు గలది మానదృష్టి యనఁబడును. ఇది వాడినవస్తువులు మొదలయిన వానియందు చెల్లును.
34. ముకుళము :—
| స్ఫురదాసక్తపక్ష్మాగ్రా సౌమ్యామిళితతారకా. | 161 |
| మీలితోర్ధ్వపుటాదృష్టిరానందే ముకుళాభవేత్, | |
తా. కదలుచున్నట్టియు, ఆసక్తితోఁ గూడినవియు నయిన కొనరెప్పలును, తిన్నదనమును, కలసిన నల్లగ్రుడ్లును, మూయఁబడిన పైరెప్పలును గలది ముకుళదృష్టి యనఁబడును. ఇది యానందమునందు వినియోగించును.
35. కుఞ్చితము:—
| కిఞ్చిత్కుఞ్చిత పక్ష్మాగ్రపుటా౽త్యర్థం నికుఞ్చితా. | 162 |
| తారాభ్యాం కుఞ్చితాదృష్టి రసూయానిష్టతాదిషు, | |
తా. కొంచెము వాల్పబడిన కొనరెప్పలును, మిక్కిలి లోఁగొనఁబడిన నల్లగ్రుడ్లును గలది కుంచితదృష్టి యనఁబడును. ఇది అనిష్టమునందును అసూయత మొదలైనవానియందును వినియోగపడును.
36. ఆకాశము:—
| ఆకాశదృష్టిరాకాశే బహువ్యావృతతారకా. | 163 |
| ఏషాప్యా౽౽కాశ సఞ్చారివస్త్వాదిషు నియుజ్యతే, | |