తా. వెనుకతట్టు చూచునట్టిచూపు విలోకితదృష్టి యనఁబడును. ఇది వెనుకతట్టు ఉండువానిని జూచుటయందు వినియోగపడును.
19. వితర్కిత:—
| వికాసితోద్వృత్తపుటా తథైవోత్ఫుల్ల తారకా. | 145 |
| త్రాసితాసమతారాచ దృష్టిర్జ్ఞేయా వితర్కితా, | |
తా. తేటయై మీఁదికి తెరవఁబడిన రెప్పలు గలదియు, విరిసి భయముతోఁ గూడినవివలె సమములైన నల్లగ్రుడ్లుగలదియు నైన చూపు వితర్కితదృష్టి యనఁబడును.
వినియోగము:—
| ఏషాతుభావశాస్త్రజ్ఞై రూహాదిషునియుజ్యతే. | 146 |
తా. ఈదృష్టి ఊహించుట మొదలైన వానియందు వినియోగించును.
20. శఙ్కితము:—
| కిఞ్చిచ్చలాస్థిరాకిఞ్చదున్నతా తిర్యగాయతా, | 147 |
తా. కొంచెము చలనము గలదియు, కొంచెము నిలుకడ గలదియు, నిక్కినదియు, అడ్డపువిరివి గలదియు, మరుగైనదియు, బెదరును తోపించెడి నల్ల గ్రుడ్లుగలదియు నైనచూపు శంకితదృష్టి యనఁబడును.
వినియోగము:—
| శఙ్కాదిషు ప్రయోక్తవ్యా ప్రోక్తానాట్య విశారదైః, | |
తా. ఇది శంక మొదలయినవానియందు వినియోగింపఁబడును.
21. అభితప్తము:—
| పుటప్రచలనం యత్రతారకే దర్శనాలసే. | 148 |
| అభితప్తా భవేద్దృష్టిర్నిర్వేద ప్రముఖే ష్వియమ్, | |