| వితర్కితా శంకితా చ అభితప్తావలోకితా, | 123 |
| లజ్జితామలినాత్రస్తామ్లానా ముకుళకుఞ్చితే, | 124 |
| జిహ్మవికోశామదిరా హృద్యాలలితసంజ్ఞికా, | 125 |
తా. సమ, ప్రలోకిత, శృంగార, స్నిగ్ధ, ఉల్లోకిత, అద్భుత, కరుణ, విస్మయ, దృప్త, విషణ్ణ, భయానక, సాచి, ద్రుత, వీర, రౌద్ర, దూర, ఇంగిత, విలోకిత, వితర్కిత, శంకిత, అభితు, అవలోకిత, శూన్య, హృష్ట, ఉగ్ర, విభ్రాంత, శాంత, మీలిత, సూచన, లజ్జిత, మలిన, త్రప్త, మ్లాన, ముకుళ, కుంచిత, ఆకాశ, అర్ధముకుళ, అనువృత్త, విప్లుత, జిహ్మ, వికోశ, మదిర, హృద్య, లలిత ఆని దృష్టిభేదములు నలువదినాలుగును.
1. అందు సమము:—
| వీక్షితం సురనారీణామివదృష్టిస్సమాభవేత్, | |
తా. దేవతాస్త్రీవలె రెప్పపాటులేనిది సమదృష్టి యనఁబడును.
వినియోగము:—
| సమాధిషు ప్రయోక్తవ్య మితి నాట్యవిదో విదుః. | 126 |
తా. సమాధులయందు ఈదృష్టి వినియోగింపఁబడునని నాట్యశాస్త్రజ్ఞులు చెప్పుదురు.
2. ప్రలోకితము:—
| ప్రలోకితా పరిజ్ఞేయా దర్శనం పార్శ్వభాగయోః, | |
తా. ఇరుప్రక్కలను జూచెడి చూపు ప్రలోకిత యనఁబడును.