తా. ఇరు ప్రక్కలయందును చలించునట్టి దృష్టి ప్రలోకితమనఁబడును.
వినియోగము:-
| ఉభయోః పార్శ్వయోర్వస్తుదర్శనే సూచనే తథా, | 115 |
తా. ఇరుప్రక్కల నుండువస్తువులను జూచుట, సయిగ చేయుట, కదలుట, కలవరము వీనియందు ఈ దృష్టి యుపయోగింపఁబడును.
5. నిమీలితము:—
| దృష్టేరర్ధవికాసే నిమీలితా దృష్టిరీరితా, | |
తా. సగము కన్ను దెరచి చూచెడి చూపు నిమీలిత మనఁబడును.
వినియోగము:—
| ఋషి వేషే పారవశ్యే జపే ధ్యానే నమస్కృతౌ. | 116 |
| ఉన్మాదే సూక్ష్మదృష్టౌనిమీలితా దృష్టిరీరితా, | |
తా. ఋషివేషము, పరవశత్వము, జపము, ధ్యానము, నమస్కారము, చిత్తచలనము, సూక్ష్మదృష్టి వీనియందు ఈ దృష్టి ఉపయోగింపఁబడును.
6. ఉల్లోకితము:—
| ఉల్లోకితమితి జ్ఞేయ మూర్ధ్వభాగోన్నతానతమ్. | 117 |
తా. మీఁదికి నిక్కించి వంపఁబడినదృష్టి ఉల్లోకిత మనఁబడును.
వినియోగము:—
| ధ్వజాగ్రే గోపురే దేవమణ్డపే పూర్వజన్మని, | 118 |