తా. నాట్యారంభము, త్రాసు, ఇతరచింతను నిశ్చయించుట, ఆశ్చర్యము, దేవతారూపము వీనియందు ఈ దృష్టి యుపయోగింపఁబడును.
2. ఆలోకితము:—
| ఆలోకితం భవేదాశు భ్రమణం స్ఫుటవీక్షణమ్, | |
తా. వడితోడి తిరుగుడుగల స్పష్టమైనచూపు ఆలోకితమనఁబడును.
వినియోగము:—
| కులాలచక్రభ్రమణే సర్వవస్తుప్రదర్శనే. | 111 |
| ఇచ్ఛాయాంచ ప్రయోక్తవ్య మాలోకితనిరీక్షణమ్, | |
తా. కుమ్మరిసారె తిరుగుట, అన్ని వస్తువులను జూచుట, ఇచ్ఛ వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.
3. సాచి:—
| స్వస్థానే తిర్యగాకార మపాఙ్గచలనక్రమాత్. | 112 |
| సాచీదృష్టిరితిజ్ఞేయా నాట్యశాస్త్రార్థకోవిదైః, | |
తా. స్వస్థానమందుండి కడకంటివరకు అడ్డముగా చలించునది సాచీదృష్టి యనఁబడును.
వినియోగము:—
| ఇఙ్గితేశ్మశ్రుసంస్పర్శే శరలక్షే౽౦శుకే స్మృతౌ. | 113 |
| సూచనాయాంచ కులటా నాట్యే సాచీనిరీక్షణమ్, | |
తా. అభిప్రాయము, మీసము దువ్వుట, గురి, వస్త్రము, తలఁపు, సయిగ, కులటానాట్యము వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.
4. ప్రలోకితము:—
| ప్రలోకితం పరిజ్ఞేయం చలనా త్పార్శ్వభాగయోః. | 114 |