తా. పుష్పాంజలిక్రమము, చారినాట్యము, లావణ్యము వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.
22. తిరశ్చీనము:—
| పార్శ్వద్వయాదూర్ధ్వభాగే చలనాత్తిర్యగీరితమ్. | 102 |
తా. ఇరుప్రక్కలందును మీఁదితట్టు చలించు శిరస్సు తిరశ్చీన మనఁబడును.
వినియోగము:—
| లజ్జానిరూపణే నృత్తే ముఖ చారీయనామని, | 103 |
తా. సిగ్గును కనపరచుట, ముఖచారి అనునృత్తము వీనియందును, ఇంక నిట్టి తగిన సమయములందును ఈ శిరస్సు చెల్లును.
23. ప్రకంపితము:—
| పునఃపునః ప్రచలనాత్పురోభాగే చ పార్శ్వయోః, | 104 |
తా. ముందరికిని ఇరుప్రక్కలకును మాటిమాటికి చలించు శిరస్సు ప్రకంపిత మనఁబడును.
వినియోగము:—
| అద్భుతాఖ్యరసే గీతే ప్రబంధే భ్రమరే తథా, | 105 |
తా. అద్భుతరసము, పాట, ప్రబంధము, తుమ్మెద, శత్రుయుద్ధభావము వీనియందు ఈ శిరస్సు చెల్లును.
24. సౌందర్యము:—
| ఊర్ధ్వాధోముఖవిన్యాసా త్పశ్చాద్భాగేనచాలనాత్, | |