ఈ పుట ఆమోదించబడ్డది

అభినయశబ్దవ్యుత్పత్తిః.

అభిపూర్వస్య నిఞధాతో రాఖ్యానార్థస్య నిర్ణయః,
యస్మాత్పదార్థాన్న యతి తస్మా దభినయస్మ్యృతః.
44

తా. అభియను నుపసర్గము పూర్వమునందుఁగల 'నీ'ఞనెడు ధాతువునకు చెప్పుట అని యర్ధము. పదార్ధములను తెలుపునది గాన నిది యభినయమని పిలువఁబడును.

గ్రన్థాన్తరే.

అభివ్యంజన్విభావానుభావాదీన్ నాటకాశ్రయాన్,
ఉత్పాదయన్ సహృదయే రసజ్ఞానం నిరంతరమ్‌. 45

అనుకర్తుస్థ్సితోయో౽ర్థో ౽భినయస్సో౽భిధీయతే,

తా. నాటకాశ్రయములయిన విభావానుభావాదులను తెలియఁ జేయునట్టిదియు, రసికుల మనములకు నిరంతరము రసజ్ఞానమును కలుగఁ జేయునట్టిదియు, అనుకర్తృనిష్టమునగు అర్థము అభినయమనఁబడును.

ఆజ్గికోవాచిక స్తద్వదాహార్య స్సాత్విక పరః. 46

చతుర్థా౽భినయస్తత్ర చా౽౽జ్గికో౽ జ్గైర్నిదర్శితః,
వాచా విరచిత కావ్యకాటకాదిషు వాచికః. 47

ఆహార్యో హారకేయూరవేషాదిభిరజ్కృతిః,
సాత్త్వికస్సత్త్వికై ర్భావై ర్భావజ్ఞాఇశ్చ నిదర్శితః.
48

తా. ఈయభినయము ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్త్వికము నని నాలుగువిధములు గలది. అందు అంగములచేతఁ జూపఁబడునది ఆంగికము. మాటలచేతఁ దెలుపఁబడునది వాచికము, ఇది కావ్యనాటకాదుల