ఈ పుట ఆమోదించబడ్డది

ధీరోదాత్తః కలావాన్ నృపనయచతురో
          సౌ సభానాయకస్స్యాత్. 21

తా. సంపదగలవాఁడును, బుద్ధిమంతుఁడును, యుక్తాయుక్తవివేకము గలవాఁడును, దానశీలుఁడును, గానవిద్యయందు నేర్పుగలవాఁడును, సర్వజ్దుఁడును, కీర్తిశాలియు, సరనగుణములుగలవాఁడును, హావభావములఁ దెలిసిన వాఁడును, మాత్సర్యాది దుర్గుణములు లేనివాఁడును, ఆయాకాలమునకుఁదగిన, మంచినడవడికల నెఱిఁగినవాఁడును, దయగలవాఁడును, ధీరోదాత్తుఁడును, విద్వాంసుఁడును, రాజనీతియందు చతురుఁడును నగువాఁడు సభానాయకుఁడు కాఁదగును. (శ్లో. గ్రీవారేచకసంయుక్తో భ్రూనేత్రా దివిలాస కృత్, భావ ఈషత్ప్రకాశోయ స్సహావ ఇతి కధ్యతే.-- అనఁగా మనోగత భావమును సంజ్ఞలు మొదలగువానిచేఁ దెలుపుట హావము. శ్లో.నిర్వికారస్య చిత్తస్య భావస్స్యా దతివిక్రియా. వికారరహితమగు చిత్తమున కత్యంతవికారము కలుగుట భావము.

మన్త్రి లక్షణమ్‌.

నిత్యంచ స్థిరభాషిణో గుణపరా శ్శ్రీమద్యశోలమ్పటా;
భావజ్ఞా గుణదోషభేదనిపుణా శ్శృంగారలీలారతాః,
మధ్య స్థానయకోవిదాస్సహృదయాస్సత్పణ్డితా భాన్తితే
భూపాభేదవిచక్షణాస్సుకవయో యస్య ప్రభోర్మంత్రిణః. 22

తా. మాటనిలుకడగలవారును, సద్గుణములను గ్రహించువారును,