2. కుళీరహస్తలక్షణమ్
| దక్షిణః కర్కటోభూయాదపవేష్టితరూపకః. | 714 |
| వామహస్తో పరిస్థాయీ శ్లిష్టశ్చా౽స్యాంగుళిఃక్రమాత్, | 715 |
తా. కుడికర్కటహస్తమును అపవేష్టితముగ ఎడమచేతిమీఁదికి చాఁచిపట్టి వేళ్లను జేర్చిన నది లీనకర్కటహస్త మౌను. ఇది కుళీరార్థమందు వినియోగించును.
3. రక్తపాయిహస్తలక్షణమ్
| రక్తపాయినిసూచీస్యాద్రేచితాతిర్యగేవచ, | |
తా. సూచీహస్తమును కదలించుచు అడ్డముగఁ బట్టిన జలగయందు చెల్లును.
4. నక్రహస్తలక్షణమ్
| పతాక స్వస్తికోహస్తోమిళితశ్చ విసర్జితః. | 716 |
| నక్రార్థే పేటికార్థేచ యోజితః పూర్వసూరిభిః, | |
తా. పతాకహస్తమును స్వస్తికముగఁ బట్టి విడిచిన నది మొసలియందును, పెట్టెయందును వినియోగించును.
5. డుణ్డుభహస్తలక్షణమ్
| దక్షిణః కర్తరీభూతః కరస్యోర్ధ్వముఖో యది. | 717 |
| అన్యప్రకోష్ఠీ వామస్స్యాత్కటకాముఖరూపతః, | 718 |
తా. కుడిచేతియందు కర్తరీముఖహస్తమును ఊర్ధ్వముఖముగాఁ బట్టి అన్యప్రకోష్ఠమందు కటకాముఖహస్తమును బట్టిన నది కర్తరీదండహస్త మౌను. ఇది యిరుదలలపామునందు వినియోగించును.